సిరా న్యూస్,తిరుపతి;
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చంద్రగిరిలో ఉన్న గన్ మాన్ ధరణి ఇంటికి చేరుకున్నారు. ధరణి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ
సభ్యులకు దైర్యం చెప్పి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గన్ మాన్, ప్రైవేట్ సెక్యూరిటీ లేకుంటే ఇవాళ నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు. వాళ్లు చూపిన ధైర్యసాహసాలు అభినందనీయం. ఓటమి భయంతో ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నారు. టీడీపీకి ఓట్లు వేశారని కూచువారిపల్లిలో చిన్న, పెద్ద, ముసలి, ముతకను పట్టుకుని చితక బాదారు. నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రజాస్వామ్యంలోఇవి మంచి పద్దతులు కాదు. చంద్రగిరిలో ప్రశాంత వాతావరణం నెలకొనాలి. పోలీసులు బాధ్యతగా వారి విధులు నిర్వహించారని పులివర్తి నాని అన్నారు.
====================