సిరా న్యూస్, జైనథ్:
తుమ్మల పార్టీ మారడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం…
– పులివేని గణేష్ యాదవ్
+ బిఆర్ఎస్ నాయకులతో కలిసి మండల కేంద్రంలో ప్రెస్ మీట్
బిఆర్ఎస్ పార్టీ జైనథ్ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పులివెందుల గణేష్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో, నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తన స్వగ్రామమైన ఆనందపూర్ లో కనీసం సర్పంచ్ కు కూడా గెలవలేని తుమ్మల వెంకట్ రెడ్డికి, మాజీ మంత్రి జోగు రామన్న జోడు పదవులు ఇచ్చారని అన్నారు. తుమ్మల వెంకట్ రెడ్డినీ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునిగా నియమించడమే కాకుండా అతని భార్య తుమ్మల అరుంధతి రెడ్డికి జెడ్పిటిసి టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగిందని అన్నారు. జెడ్పిటిసి గా గెలిచిన తర్వాత సుమారు రూ. 2 కోట్ల జడ్పీ నిధులతో వివిధ పనులు చేపట్టి, వ్యక్తిగతంగా ఎంతో లబ్ధి పొందిన ఆయన నేడు పార్టీ మారడం సబబు కాదన్నారు. నేడు తుమ్మల వెంకట్ రెడ్డి అనుభవిస్తున్న హోదా మాజీ మంత్రి జోగు రామన్న పుణ్యమే అని అన్నారు. కేవలం అతను పార్టీ మారడమే కాకుండా, జడ్పీ నిధులనుండి పనులు ఇస్తామని ఇతర సర్పంచులను సైతం భయపెడుతూ కాంగ్రెస్ లోకి లాగేందుకు చూస్తున్నారని అన్నారు. ఆయన పార్టీ మారడంతో బిఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదని, పార్టీ శ్రేణులంతా జోగురామన్న వెంటే ఉన్నారని పునరుద్ధఘట్టించారు. ఈ సమావేశంలో స్థానిక సర్పంచ్ దుమాల దేవన్న, ఇతర బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.