కోలుకున్న విద్యార్దులు
సిరా న్యూస్,జీలుగుమిల్లి;
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి లోని గిరిజన బాలుర ఆశ్రమ వసతి గృహంలో 42 మంది బాలురకు వాంతులు విరేచనాలు అయ్యాయి. ఆదివారం సెలవు రోజు కావడం తో బయట ఆహారం తినడం వల్ల అలా జరిగి ఉండవచ్చు అని వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. వసతి గృహంలో మెడికల్ క్యాంప్ పెట్టి బాలురకు పలు రకాల వైద్య పరీక్షలు చేసారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండటం తోసిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.