సిరాన్యూస్, ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా పురాభాయి అశోక్
ఆదిలాబాద్ జిల్లా ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా పురాభాయి అశోక్ ను నియమిస్తున్నట్లు ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బత్తిని సత్యనారాయణ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. తనను జిల్లా అధ్యక్షునిగా నియమించిన సత్యనారాయణ గౌడ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అధ్యక్షునిగా అత్యంత క్రమశిక్షణతో పనిచేస్తానని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఫార్మసిస్ట్ చట్టాల అమలుకు, రిజిస్టర్ ఫార్మసిస్టుల హక్కుల సంరక్షణకు , వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనకు ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు.