భాజపా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్న పురందేశ్వరి

సిరా న్యూస్,గన్నవరం;
ఎన్టీఆర్ జిల్లా జక్కుల నెక్కలం గ్రామంలో భాజపా పార్టీ సభ్యత్వ నమోదుకార్యక్రమంలో భాజపా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గోన్నారు. జక్కుల నెక్కలం గ్రామంలో స్థానిక ప్రజల మొబైల్స్ లో భాజపా పార్టీ సభ్యత్వం నమోదు చేసారు
పురందేశ్వరి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదుని ఈనెల రెండో తారీఖున ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ. నిబద్దతో అంకితభావంతో పనిచేస్తున్నరు కాబట్టి మంచి స్పందన వస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి ఈ గ్రామమే కాబట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బుడమేరు వరద ముంపుకు నీట మునిగి పాడైన పంటలను పరిశీలించాం. వరదలు వచ్చిన టైంలో మంత్రితోపాటు నేను వచ్చాను ఈ గ్రామానికి రాలేకపోయాను. చాలావరకు పంట కావచ్చు ఇళ్ళు కావచ్చు ఇమ్యునరేషన్ జరిగింది.పంట నష్టపోయిన వారు కొంతమంది మిగిలిపోయారు అని మా దృష్టికి వచ్చిందని అన్నారు.
కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి వారి పేర్లు నమోదు చేశారు. సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది వారి మా సహకారం ఉంటుంది.
ఈ వర్షాల కారణంగా సభ్యత్వ నమోదు ఆలస్యమైంది అయినా ప్రజలు ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తున్నారు ముందు ముందు పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *