స్వచ్ఛదనం పచ్చదనం నిరంతరం జరగాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఆదర్శంగా నిలవాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన కలెక్టర్, ఎమ్మెల్యే
సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిరంతరం జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం లో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18, 19 వార్డుల ప్రధాన కూడలిలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమన్ని అధికారులు, ప్రజల సహకారంతో జిల్లాలో విజయవంతంగా అమలు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఐదు రోజులే కాకుండా నిరంతరం జరగాలని సూచించారు. ప్రజలు ఇండ్ల పరిసరాలు, గ్రామాలు, మున్సిపాలిటీలో ప్రతి ఇంటిలో మొక్కలు నాటి సంరక్షిస్తే పచ్చదనం ఏర్పడి మంచి వాతావరణం నెలకొంటుందని కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ… ప్రతి ఇంటిలో కచ్చితంగా మొక్కలు నాటి చిన్నపిల్లల మాదిరి చెట్లను కాపాడితే అవి తిరిగి మనల్ని కాపాడతాయని అన్నారు. వానాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పారిశుధ్య పనులు నిర్వహించాలని ప్రతి ఒక్కరు ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనం పెంచి ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *