సిరాన్యూస్, ఖానాపూర్
పోలింగ్ బూత్‌లను సందర్శించిన బాధావత్ పూర్ణ చందర్ నాయక్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, కడెం , జన్నారం మండలాల్లో ఉన్న పలు పోలింగ్ బూత్‌లను సోమవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బాధావత్ పూర్ణచందర్ నాయక్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సందర్శించారు. అనంతరం కేంద్రాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఓటు వినియోగించుకుంటున్న సభ్యులతో అప్యాయంగా పలకరించారు. వారి వెంట ఖానాపూర్ నియోజకవర్గ వివిధ మండల నాయకులు, పూర్ణ చందర్ నాయక్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.