సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖ ఆరిలోవలో ప్రభుత్వం కేటా యించిన భూమిలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి కుటుంబ సభ్యులతో కలిసి పీవీ సింధు భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఏడాదిలోపు అకాడమీ నిర్మాణంచేస్తామని తెలిపారు. విశాఖలోని యువతకు బ్యాడ్మింటన్ నేర్చుకునే సామర్థ్యం ఎక్కువని చెప్పారు. అకాడమీకి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని, దీని ద్వారా ఎంతోమంది క్రీడాకారులు పథకాలు సాధించేలాగా చేస్తామనిపేర్కొన్నారు.