సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖ పెదగంట్యాడ పరిధిలో గంగ వరం పోర్టు ఏరియాలో అర్ధరాత్రి కొండచిలువ కార్మికులను భయ భ్రాంతులకు గురి చేసింది. పోర్టు ఏరియాలో సంచరిస్తున్న కొండచి లువను చూసి కార్మికులు పరుగులు చేశారు. స్నేక్ సేవర్ సొసైటీకి చెందిన కిరణ్ కుమార్ కి కార్మికులు సమా చారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కిరణ్ కుమార్ కొండచిలువను చాకచక్యంగా పట్టుకొని దూరంగా తీసుకెళ్లి వదిలివేయడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు.