Rabindrachari: పీవీ నరసింహారావు స్మారక పురస్కారాన్ని అందుకున్న కవి రవీంద్రాచారి

సిరా న్యూస్, ఓదెల
పీవీ నరసింహారావు స్మారక పురస్కారాన్ని అందుకున్న కవి రవీంద్రాచారి

పీవీ నరసింహారావు స్మారక పురస్కారాన్ని యువ కవి, చిత్రకారులు బ్రాహ్మాండ్ల పల్లి రవీంద్రా చారి అందుకున్నారు. ఓదెల తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్చంద సేవా సంస్థ జాతీయ చైర్మన్ పోలోజు రాజకుమార్ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర ఆరు రాష్ట్రాల వారికి వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి మాజీ ప్రధాని భారత రత్న పీవీ నర్సింహా రావ్ జయంతి ఉత్సవాలు 2024 సందర్బంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫిలిం భవన్ లో ఆదివారం నిర్వహించారు. జాతీయ పురస్కారాల ప్రధానోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిలు గా విశ్వ కళా విరాట్ బ్రహ్మ డాక్టర్ వంగల శాంతి కృష్ణ ఆచార్యులు హాజ‌ర‌య్యారు. ప్రముఖ సినీ హాస్య నటుడు ఆర్ ఎస్‌ నంద జాతీయ చైర్మన్ పోలోజు రాజకుమార్ ల‌ చేతుల మీదుగా పీవీ నరసింహారావు స్మారక పురస్కారాన్ని పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన యువ కవి చిత్రకారులు బ్రాహ్మాండ్ల పల్లి రవీంద్రా చారి అందుకున్నారు. అనంతరం హాస్య కిరీటి ఆర్ఎస్ నంద మాట్లాడుతూ ప్రతి మనిషికి సంపద ఎంత ఉన్న, అధికారం ఎంత ఉన్నా, బొగ భాగ్యాలు ఎన్ని ఉన్నా, సంపదలో పడి ఆరోగ్యానికి దూరం అవుతున్నారని తెలిపారు. కోట్ల కున్నోడైన కూటికి లేనోడైన నవ్వకు దూరం కాకండి ప్రతిరోజు 10 నిమిషాలు నవ్వితే ప్రతి మనిషి ఉత్సాహంగా ఉంటాడని అన్నారు. కార్యక్రమంలో రాజు, కవులు, కవయిత్రులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *