సిరా న్యూస్, ఓదెల
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సమావేశం
పెద్దపల్లి జిల్లా ఓదెల సోమవారం జడ్పీహెచ్ఎస్ ఓదెల పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో అధ్యక్షులు ఐలి రాధిక, కన్వీనర్ వి పద్మ , కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సమావేశంలో పాఠశాలకు అవసరమైన బాలురు బాలికల టాయిలెట్స్ ను, నీటి వసతి సౌకర్యాన్ని, వివిధ రకాల మౌలిక సదుపాయాలను పరిశీలించి, పాఠశాల అవసరాన్ని గుర్తించి వాటి నిర్మాణ మరమ్మతులను చేపట్టుటకు కమిటీ అధ్యక్షులు, కన్వీనర్, కమిటీ సభ్యుల ఆమోదంతో తీర్మానం చేశారు.సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.