Raghu Yadav: వెలిచాల రాజేందర్ రావును ఎంపీగా గెలిపిద్దాం:  యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ రఘు యాదవ్

సిరాన్యూస్, సైదాపూర్
వెలిచాల రాజేందర్ రావును ఎంపీగా గెలిపిద్దాం:  యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ రఘు యాదవ్
* ఏక్లాస్ పూర్ లో గడపగడపకు ఎన్నికల ప్రచారం

వెలిచాల రాజేందర్ రావును ఎంపీగా గెలిపిద్దామ‌ని యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ రఘు యాదవ్ అన్నారు. శ‌నివారం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా సైదాపూర్ మండలం ఏక్లాస్ పూర్ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు అంబాల ప్రేమ్ కుమార్, యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ రఘు యాదవ్ ఆధ్వర్యంలో గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును అధిక మెజారిటీతో గెలిపించాలని సుమారు 300 మందితో గ్రామంలో వాడ వాడలా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేసే ఆలోచనలో అ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, భారత రాజ్యాంగం జోలికి వస్తే ఎవరిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో అవినీతికి పాల్పడింది తప్ప పేద ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని అన్నారు. ఇలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు . కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, దస్తగిరి ,క్రాంతి రవీందర్, సంపత్, శ్రీనివాస్, రఘుపతి, రాజు ,క్రాంతి ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *