సిరా న్యూస్,విశాఖపట్నం;
కొమ్మాది జవహర్ నవోదయ విద్యాలయంలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. సుమారు 20 మంది ప్లస్ టూ విద్యార్థులు గ్రూపుగా ఏర్పడి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులతో వారి బట్టలు ఉతికించుకొని వారి నుండి 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇవ్వని వారిని కర్రలుతో కొట్టి హింసిస్తున్నారు. దీంట్లొ నవోదయ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతుంది..