కమాన్ పూర్ లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

 సిరా న్యూస్,కమాన్ పూర్;
కమాన్ పూర్ మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమాన్ పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ మండల ప్రధాన కార్యదర్శి మల్యాల తిరుపతి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ 53వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు . కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశంలో గణనీయమైన సీట్లు సాధించి ఎన్డీఏ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించి మోడీ లాంటి నియంతిత్వ పోగోడలను నియంత్రించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నాయకుడు రాహుల్ గాంధీ ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగు సత్యనారాయణ యూసుఫ్ లల్లు రఫిక్ నగునూరి నరసయ్య నగునూరి నర్సయ్య అంబిరి శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ నాయకులు మల్యాల మహేష్ బిల్లా కృష్ణ తాడిపల్లి సుమన్ తదితరులు పాల్గొన్నారు.
==========================xxxx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *