సిరా న్యూస్,బోథ్
అకాల వర్షం… అన్నదాత అతలాకుతలం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ సోనాలలో సోమ మంగళ వారాలు కురిసిన వర్షాలకు అన్నదాత తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాల కారణంగా చేతికి వచ్చే జొన్న, సెనగ, గోధుమ, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం సంభవించింది ఈదురుగాళ్లతో చేతికందే పంట నేలపాలయ్యిందని రైతుల ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం పూట సొనాల గ్రామం సమీపంలో ఈదురుగాల బీభత్సం వల్ల పంటలు నేల కొరిగాయని రైతులు వాపుతున్నారు. అధికారులు పంట నష్టం పై సర్వే సర్వే నిర్వహించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.