సిరా న్యూస్, చిగురుమామిడి
చిగురుమామిడిలో వర్షం బీభత్సం
ఓ వైపు ఎండలు మండుతుండగా చిగురుమామిడి మండల వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములతో భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. సీతారాoపూర్ లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి.ఐకెపి సెంటర్లల్లో వడ్లు తడిసిపోయాయి. మండలంలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన సిర్ర సంజీవరెడ్డి మామిడి తోట వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నది. కాయలు పూర్తిగా రాలిపోయాయి. మామిడి రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అలాగే తాటి చెట్టుపై పిడుగు పడడంతో చెట్టు కాలిపోయింది.