సిరాన్యూస్, ఇచ్చోడ
ఇచ్చోడలో భారీ వర్షం
* లేచిపోయిన ఇండ్ల పైకప్పులు.. నేలకొరిగిన వృక్షాలు
* దెబ్బతిన్న పంటలు.. ఆందోళనలో రైతులు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని పలు గ్రామాల్లో పలువురి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. పలు వృక్షాలు నేలకొరిగాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి మొక్కజొన్న, జొన్న పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.