సిరా న్యూస్,విశాఖపట్నం;
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీ డనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుం డంగా బలపడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణం శాఖ అధికారులు తెలిపా రు. దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.కోస్తా తీరం వెంబడి గంటకు 45-65కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అదే విధంగా నేడు, రేపు రాష్ట్రంలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.