సిరాన్యూస్,ఓదెల
జీవితంపై విరక్తి చెంది నేదురు రాజ కొమురయ్య ఆత్మహత్య
జీవితంపై విరక్తిచెంది ఓవ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై జి అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన నేదురు రాజ కొమురయ్య(51) మడక గ్రామంలో టైర్ పంక్చర్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో పంక్చర్ షాపు సరిగా నడవక పోవడంతో పాటు కుమారుని వివాహానికి చేసిన అప్పులు అధికమయ్యాయి. దీంతో మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం రాజ కొమురయ్య ఇంటిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కుటుంబ సబ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.