Rajaganganna:ప్రతిపక్ష పార్టీలను అణచివేసేందుకు అరెస్ట్‌లు

సిరా న్యూస్, ఖానాపూర్
ప్రతిపక్ష పార్టీలను అణచివేసేందుకు అరెస్ట్‌లు
* బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు తాల్లపెళ్లి రాజగంగన్న
ప్రతిపక్ష పార్టీలను అణచివేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు తాల్లపెళ్లి రాజగంగన్న అన్నారు. శుక్ర‌వారం ఖానాపూర్ పట్టణంలో ని బిఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో శ‌నివారం విలేకరుల సమావేశంలో ఖానాపూర్ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు తాల్లపెళ్లి రాజగంగన్న పట్టణ అధ్యక్షుడు గోరికర్ రాజు మాట్లాడారు.ఐటి, ఈడి, సిబిఐ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రతిపక్ష పార్టీలను అణచివేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వారు విమర్శించారు. బడే భాయ్ మోడీ చోటే భాయ్ రేవంత్ రెడ్డి రచించిన రాజకీయాకుతంత్రమ‌న్నారు. కవితక్క అరెస్ట్బి ఆర్ఎస్ క్యాడర్ ను భయపెట్టి లోక్ సభ ఎన్నికల్లో ఫలితం పొందాలనే దురుద్ధేశ్యం తో బీజేపీ ఉంద‌న్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ అబ్దుల్ ఖాళిళ్, బిఆర్ఎస్ నాయకులు అంకర్ రవికుమార్, చుక్కల నరేష్, అమంద రఘు , సాయినరేష్ , గాజుల అజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *