Rajaka Sangam Chandraiah: రజకుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి:  ఓదెల రజక సంఘం అధ్యక్షులు మేడిచేలిమెల చంద్రయ్య

సిరాన్యూస్, ఓదెల
రజకుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి:  ఓదెల రజక సంఘం అధ్యక్షులు మేడిచేలిమెల చంద్రయ్య
* ఓదెలలో సాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి వేడుకలు

రజకుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఓదెల రజక సంఘం అధ్యక్షులు మేడిచేలిమెల చంద్రయ్య అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో సాయిధ పోరాట యోధురాలు చిట్యాల చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి వేడుకలు రజక సంఘం ఆధ్వ‌ర్యంలో నిర్వహించారు. ఈసంద‌ర్బంగా ఓదెల రజక సంఘం అధ్యక్షులు మేడిచేలిమెల చంద్రయ్య మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటినుండి కులవృత్తి చేసుకునే రజకుల బతుకులు మారలేదని అన్నారు . రజకుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రామడుగు వెంకటేష్ సభ్యులు శతల్ల కుమార్, శతల్ల విష్ణు , శతల్ల రవి , శతల్ల శ్రీనివాస్ , రామడుగు శ్రీనివాస్ , మాచర్ల కిరణ్ , మడికొండ కానుకమ్మా , రామడుగు శ్రీను, మడికొండ వెంకటేష్ , వాడ్డురి రాయమల్లు, రెడ్డిరాజుల రాజేశం, రామడుగు రాజకుమార్, రామడుగు చెంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *