సిరాన్యూస్, హుస్నాబాద్:
అత్యాచార నిందితులను బహిరంగంగా ఉరితీయాలి: రాజనాయక్
లంబాడి బాలిక పై అత్యాచారం చేసిన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజనాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసుల నిర్లక్ష్యం తోనే హైదరాబాద్ నడిబొడ్డున మియాపూర్ నడిగడ్డ తండాలో గిరిజన మైనర్ బాలికపై అత్యాచారం, హత్య జరిగిందని ఆరోపించారు. నిందితులను తక్షణమే పట్టుకొని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.