సిరాన్యూస్, ఆదిలాబాద్
విపత్తు నిర్వహణ ప్రణాళిక తయారు చేయాలి : కలెక్టర్ రాజర్షి షా
విపత్తు నిర్వహణ పట్ల జిల్లా అధికారులందరికీ పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. శనివారం వేడు గాలులు ప్రకృతి విపత్తు నిర్వహణ అవగాహన కార్యక్రమంలో జిల్లా అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన శిక్షణ కార్యక్రమానికి డాక్టర్ శ్రీనివాస్ పీపీటీ ద్వారా వివరించారు.ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ సంబంధిత అధికారులు డీఏఓ, మెడికల్, అగ్నిమాపక శాఖ, డీపీఓ, ఆర్‌టీసీ, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులు మీమీ పరిధిలో వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా , అధిక ఉష్ణోగ్రతల వల్ల తగు ఏర్పాట్లు కోసం యాక్షన్ ప్లాన్ ఈ నెల 31 లోగా సమగ్ర ప్రణాళిక రూపొందించి ముఖ్య ప్రణాళిక అధికారికి అందజేయాలని జిల్లా పాలనాధికారి అధికారులను ఆదేశించారు . పలు కూడళ్లలో, బస్ స్టాండ్ లో, తదితర ప్లేస్ లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ లో అంతరాయం కలగకుండా చూడాలని, అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తం గా ఉండాలని, ప్రతీ మండలాల్లో క్యాంపులు నిర్వహించి పశువులకు మేత, త్రాగు నీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే ఎండ తీవ్రత అధికంగా ఉన్న రోజుల్లో ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని, అత్యవసరమైతేనేతప్పా తగు జాగ్రత్తలతో బయటకు రావాలని కోరారు. అన్ని చోట్ల ఓఆర్ ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచాలని, ఆశావర్కర్ల తో పంపిణీ చేసే విధంగా వైద్యాధికారి చర్యలు చేపట్టాలని తెలిపారు.ఈ సమావేశం లో అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ వికాస్ మహతో, సుపెరెండెంట్ రాజేశ్వర్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.