సిరాన్యూస్,ఆదిలాబాద్
సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెండు రోజుల్లో పూర్తి చేయాలి : కలెక్టర్ రాజర్షి షా
* ట్యాంకర్స్ ద్వారా నీటిని సరఫరా చేయాలి
తాగు నీటి సమస్య ఉన్నచోట ట్యాంకర్స్ ద్వారా నీటిని సరఫరా చేయాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరం లో వేసవిలో తాగునీ నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు, అమ్మా ఆదర్శ పాఠశాల కమిటి, లేబర్ మొబలైజేషన్, స్కూల్ డ్రెస్సెస్ స్టిచింగ్, పోస్టల్ పేమెంట్, పీఎంకే ఎస్ వై వర్క్ ప్రోగ్రెస్, నర్సరీ ల పై ఇంజనీర్స్,ఎంపివో, డి పి ఓ, ప్రత్యేక అధికారులు తదితర శాఖల అధికారులతో జిల్లా పాలనాధికారి రాజర్షి షా సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ వేసవిలో గ్రామాలలో నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంబంధిత అధికారులను ఆదేశించారు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్నచోట ట్యాంకర్స్ ద్వారా ఇంటింటికి నీటిని సరఫరా చేయాలని, గ్రామాల్లో ప్రస్తుతం తాగునీటి సరఫరా, బోర్లు, ఓపెన్ బావులు, నీటి వనరుల గురించి మండలాల వారిగా ఎంపిడివో, ఎంపీ ఓ, ఏ ఈ లను ఎక్కడెక్కడ నీటి సమస్య ఉందో అడిగి తెలుసుకున్నారు. తాగునీటి విషయమై పైప్ లైన్, మోటార్ల మరమ్మతులు తదితరాలు వెంటనే పూర్తి చేయాలన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెండు రోజుల్లో సమర్పించాలని, ఎండ తీవ్రత ని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో నీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని, మిషన్ భగీరథ నీరు రాని చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఎండ తీవ్రత ను దృష్టిలో ఉంచుకొని ప్రజలు బావుల వద్ద కు, బయటకు రాకుండా ఇంటింటికి నీటిని సరఫరా చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆదేశించారు .అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం, తరగతి గదుల మేజర్, మైనర్ మరమ్మతులు, టాయిలెట్లలను, బాలికల కోసం అదనపు టాయిలెట్ల నిర్మాణ పనులు, విద్యుత్ సౌకర్యం, పెయింటింగ్ వంటి మౌలిక వసతుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చేపట్టాల్సిన పనుల గురించి కార్యాచరణ రూపొందించుకోవాలని, ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి, అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చేపట్టాల్సిన పనులు గుర్తించి కమిటి తీర్మానాలు చేసుకోవాలని తెలిపారు.ఈ సమీక్షా సమావేశం లో ట్రైనీ కలెక్టర్ వికాస్ మహతో, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయన్న సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.