సిరాన్యూస్, ఉట్నూర్
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి : కలెక్టర్ రాజర్షి షా
* తాగునీటిపై ప్రత్యేక దృష్టి
* ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల సందర్శన
గ్రామాల్లోని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆదేశించారు.శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం భూర్సాన్ పటార్, రాంజీ గూడ, ఉట్నూర్ లోని ఉమ్రి గ్రామాల్లో కలెక్టర్ రాజర్షి షా పర్యటించారు.ఈసందర్భంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లను పరిశీలించారు. అనంతరం రాంజీ గూడ లోని ఓపెన్ వెల్ ( బావి) ని పరిశీలించారు. గ్రామస్థులు బావి నీరు ను గత కొంత కాలంగా వాడడం లేదని, ఆ నీటిని వ్యవసాయానికి వాడుతున్నారని, రాంజీ గూడ నుండి భూర్సాన్ పటార్ కి రెండు కిలో మీటర్ల దూరంలో ఉందని జనాభా మొత్తం 290 ఉన్నారని ఈఈ కలెక్టర్‌కు వివరించారు. ఇంతకు ముందే స్పెషల్ డెవలప్ ఫండ్ కింద మంజూరైన 5 లక్షల రూపాయలు రాంజీ గూడ బావి నుండి బూర్షన్ పటార్ రెండు కిలో మీటర్ల వరకు పైప్ లైన్ పనులు ప్రారంభించాలని తెలిపారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మౌళిక సదుపాయాల కల్పన కోసం ఇంతకు ముందే మంజూరైన 3.60 లక్షల రూపాయలతో తా గునీరు, తరగతి గదుల రిపెర్స్, విద్యుత్, టాయిలెట్స్ రెపర్స్. జూన్ 10 లోగా చేయించుకోవాలని అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్మన్ కు తెలిపారు.అంతకుముందు జిల్లా పాలనాధికారి గ్రామం లో ఉన్న సమస్యలను గ్రామ పటేల్ ను అడిగి తెలుసుకొని పరిష్కరిస్తామని అన్నారు.అనంతరం ఉట్నూర్ ఉమ్రీ గ్రామం పర్యటించి ఉమ్రి లో ఎక్కడెక్కడ తాగునీటి సమస్య పై గ్రామస్తులను అడగగా మిషన్ భగీరథ నీరు రెండు మూడు రోజులకు ఒకసారి వస్తుందని, ఆ వచ్చిన నీరు ట్యాంక్ నిండడం లేదని తెలిపారు.దీనికి సంబంధించి టాంకర్లతో నీటిని సరఫరా చేయాలని, శాశ్వత పరిష్కారం కొరకు ఉమ్రికి రెండు కిలమీటర్ల దూరం లో చెరువు ఉందని తెలుపగా సర్వే చేసి రిపోర్ట్ సమర్పించాలని ఆర్‌డబ్లూఎస్ ఎస్‌సీని ఆదేశించారు.అనంతరం ఆంజనేయస్వామిని దర్శించుకొని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి అన్ని గదులను పరిశీలించి ఎన్ ఆర్‌సీ, ఎస్ఎన్‌సీయూ లో ఉన్న శ్యామ్ మామ్ పిల్లల ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.వైద్యుల చార్ట్ ఏర్పాటు చేసినట్లుగానే స్టాఫ్ నర్స్, సిబ్బంది డ్యూటీ ల వారిగా చార్ట్ ఏర్పాటు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.