సిరాన్యూస్, ఆదిలాబాద్
ఈనెల 14 వరకే ఓటరు నమోదు : జిల్లా కలెక్టర్ రాజర్షి షా
18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ నెల 14వ తేది లోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 14వ తేది వరకు ఓటరుగా నమోదు కు ఇంకా రెండు రోజులే సమయం ఉన్నందున అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు.ఏప్రిల్ 1 వ తేది వరకు 18 సంవత్సరాలు నిండిన యువతి యువకుల ఫారం -6 నింపి సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు కొత్తగా ఓటర్ నమోదు కొరకు ఇవ్వాల్సిందిగా , అంతేకాకుండా ఆన్లైన్ దరఖాస్తు యాప్ లో ఆధార్ కార్డు లేదా ఎస్ ఎస్ సి మార్కు మెమో ఆధారంగా కొత్త ఓటర్ల కొరకు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ మే 13 రోజున జరగబోవు పార్లమెంట్ ఎన్నికలలో తప్పకుండా పాల్గొని తమ ఓటును తమ కుటుంబ సభ్యులు ఓటును వినియోగంచుకోవాలని తెలిపారు.నూతన ఓటర్లు గా జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని , ప్రతి ఒక్కరూ భాద్యతగా, నిజాయితీగా, నిర్భయంగా ఓటు వేయాలని, పోలింగ్ శాతన్ని పెంచాలని కోరారు. ఓటరు జాబితా లో ఓటు ఉన్నది లేనిది పరిశీలించుకొని , లేని పక్షంలో ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు, ఇప్పటి వరకు ఓటరుగా నమోదు చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.