Rajarshi Shah: న‌కిలీ విత్త‌నాలు స‌ర‌ఫ‌రా చేస్తే చ‌ర్య‌లు : క‌లెక్ట‌ర్ రాజర్షి షా

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
న‌కిలీ విత్త‌నాలు స‌ర‌ఫ‌రా చేస్తే చ‌ర్య‌లు : క‌లెక్ట‌ర్ రాజర్షి షా
జిల్లాకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచాలి
* వానాకాలం 2024 సాగుకు సన్నద్ధం కావాలి
* ఈనెల 18 లోపు విత్తనాల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి
* మండలాల పరిధిలో ప్రతి మంగళ , శుక్రవారం సమావేశాలు జరపాలి
* విత్తన, ఎరువుల డీలర్లల‌కు అవగాహన

నకిలి పత్తి విత్తనాలు సరఫరా చేసిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ క‌లెక్ట‌ర్ రాజర్షి షా అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విత్తన ఎరువుల డీలర్ల తో నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా పాలనాధికారి పాల్గొని మాట్లాడారు. వచ్చే వానాకాలం 2024 సాగుకు సన్నద్ధం కావాలని, సీజన్ లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని ఆన్నారు.డీలర్లు షాపు కు సంబంధించిన లైసెన్స్ లు తప్పనిసరిగా వుండాలని, విత్తనాలు, ఎరువులు షాప్ లో ఉన్న స్టాక్ ను రోజు వారిగా నమోదు చేసి వీటికి సంబందించిన బిల్ బుక్, రిజిష్టర్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మరాదని, గడువు ముగిసిన విత్తనాలు, ఎరువులు అమ్మరాదని , అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.ఎక్కడా కూడా విత్తనాలు, ఎరువుల కొరత ఉండకూడదని, జిల్లాకు సరిపడా విత్తనాలను, ఎరువులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.నకిలి పత్తి విత్తనాలు సరఫరా చేసిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రెండు రోజుల్లో విత్తనాలు ఎరువుల పూర్తి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞన్, వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య, ఏడి లు, ఏ ఓ లు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *