సిరాన్యూస్,ఆదిలాబాద్
జూన్ 10లోగా పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలి: కలెక్టర్ రాజర్షి షా
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టాల్సిన కనీస మౌలిక వసతులకు సంబంధించిన పనులను జూన్ 10 లోగా పూర్తిచేయాలని జిల్లా పాలనాధికారి అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్య, పంచాయతీ, డీఆర్‌డీఓ, సీఈఓ , మున్సిపల్, పీఆర్ , డీఎల్‌పీఓఎస్, ఈఈలు, డీఈఈ లు, ఏఈఈ లు, పెయింటింగ్స్ ఏజెన్సీ లతో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జిల్లాలో అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ సెలెక్ట్ చేసిన మొత్తం 678 లో 668 కమిటీ ఏర్పాటై అకౌంట్ ఓపెన్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ, పెయింటింగ్, బెంచీలు, గ్రీన్ చాక్ బోర్డు, మేజర్ మైనర్ మరమ్మతులు, పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చేపట్టవలసిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న పనులు నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేయాలని , పాఠశాలల్లో తాగు నీటి సమస్య లేకుండా చూడాలని తెలిపారు. పాఠశాలల్లో తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ తదితర వాటిని రిపేర్ చేయించు కోవాలనీ , టాయిలెట్స్ లేనిచోట కొత్తవి నిర్మాణం చేపట్టాలని తెలిపారు. పాఠశాలల్లో పనులు చేపట్టక ముందు, పనులు చేపట్టిన తర్వాత వాటి ఫోటోలను తీసి పంపించాలని తెలిపారు.ఈ క్రమంలో మండలాల వారీగా ఒక్కోక్కరిని వారి పరిధిలో ఉన్న పాఠశాలల పురోగతిని అడిగి తెలుసుకొని, ఎక్కడెక్కడ ఇంకా పనులు ప్రారంభించ లేదో త్వరగా ప్రారంభించి జూన్ 10 లోగా పూర్తి చేయాలని, జూన్ 12న పాఠశాలలు ప్రారంభించ కనుక ఆలోపే పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్ , డీఈఓ ప్రణీత, సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు