సిరాన్యూస్, ఆదిలాబాద్
సోలంకి పూజకు రూ.3లక్షల చెక్కు అందజేత : కలెక్టర్ రాజర్షి షా
జిల్లా సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మంజూరు కాబడిన మూడు లక్షల రూపాయల చెక్కును సోలంకి పూజకు జిల్లా పాలనాధికారి రాజర్షి షా అందజేశారు. సోమవారం జిల్లా పాలనాధికారి తన ఛాంబర్ లో సోలంకి పూజకి 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా సోలంకి పూజ భర్త సోలంకి సుధాకర్ ఆర్మీలో పనిచేస్తూ సర్వీసులో ఉండగా గత ఏడాది 2023 ఆగస్టు 6 న మృతి చెందారు. సెంట్రల్, స్టేట్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి తన కుటుంబ సభ్యుల వివరాలు, యోగక్షేమాలు తెలుసుకొని చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో డీవైఎస్ ఓ వేంకటేశ్వర్లు, డీపీఆర్ ఓ తిరుమల, అదిలాబాద్ మాజీ సైనిక సంఘ అధ్యక్షులు శంకర్ దాస్, దేవన్న ఆర్ై, అశోక్, తిరుపతి రెడ్డి, వామణ్ రెడ్డి పాల్గొన్నారు.