సిరా న్యూస్, ఆదిలాబాద్
స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా
ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి,ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసి , సంజయ్ గాంధీ పాల్ టెక్నిక్ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పోలీస్ భద్రతను, సీసీ కెమెరాల పనితీరును, పోలీస్ సిబ్బంది విదుల నిర్వహణను ఆయన పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.