సిరా న్యూస్, బేల
వర్షాకాలంలోముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా
వచ్చే వర్షాకాలంలో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. ముఖ్యంగా బేలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ఉర్దూ మీడియం, తెలుగు మీడియం పాఠశాల సందర్శించారు. పాఠశాలలో పరిశుభ్రత ,గ్రీనరీని పాఠశాల ప్రహరీ, ఫ్లోరింగ్ లైటింగ్ ఎప్పటికప్పుడు మైంటైన్ చేయాలన్నారు. మరమ్మతు పనులు పూర్తి చేయాలని సూచించారు. బడి బాట కార్యక్రమంపై ఐకెపి స్టాప్ , ఏపీఓలతో మీటింగ్ నిర్వహించారు. అలాగే కొన్ని మందుల షాపులు, ఫర్టిలైజర్ షాపులో తనిఖీలు చేపట్టారు.ప్రజలను ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు స్టాక్ బుక్ ఉంచాలని సూచించారు. నాణ్యమైన పత్తి గింజలను అందించాలని తెలిపారు. ఎరువులను పక్కదారి పోకుండా వ్యవసాయ అధికారులు చూడాలని సూచించారు. గ్రామాలలో సరిగ్గా రహదారులు లేని గ్రామానికి వెంటనే రేషన్ బియ్యం పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సవాయి సింగ్, ఏజెన్సీ గిర్థవార్ సాజిద్ ఖాన్, బేల ఇంచార్జ్ వ్యవసాయ అధికారి సంధ్యారాణి, నగేష్ పాల్గొన్నారు.