సిరా న్యూస్, జైనథ్
పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపడుతున్న నిర్మాణ పనులను శనివారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం జైనద్ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.