సిరాన్యూస్, ఆదిలాబాద్
గోదాంలో భద్రపర్చిన ఈవీఎంలు: కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం- 2023 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న తెలంగాణ హై కోర్టు లో,ఎన్నికల పిటిషన్ నెంబర్ ఈపీ నెం. 26/24 ద్వారా తన ప్రత్యర్థి అయిన పాయల్ శంకర్ అపిడివిట్ పై కేసు నమోదు చేశారు. అయితే మే 3న ఈ కేసులో ఈవీఎంల పైన ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేనందున ఈవీఎంలు రిలీజ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా బుదవారం స్థానిక టీటీడీసీ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ నుండి శాంతి నగర్ ఈవీఎం గోదాం లో రాజకీయ పార్టీ ప్రతినిధులు, అభ్యర్ధులు, ఆధికారుల సమక్షంలో భద్రపరచడం జరిగిందని జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు.అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, ఆర్‌డీఓ వినోద్ కుమార్, రాజకీయ పార్టీ ప్రతినిధులు, అభ్యర్ధులు,తదితరులు పాల్గొన్నారు.