Rajarshi Shah: గ్రూప్-1 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌ రాజర్షి షా

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
గ్రూప్-1 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌ రాజర్షి షా

గ్రూప్-1 ప్రిలిమినరి పరీక్ష కేంద్రాలను ఆదివారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా
ఆదిలాబాద్ జిల్లాలోని బంగారిగూడ లోని తెలంగాణా మోడల్ స్కూల్ , టీచర్స్ కాలనీ లోని ఎస్ఆర్ డిజే స్కూల్, మావల లోని శ్రీ చైతన్య స్కూల్, ఎస్‌టీ థామస్ స్కూల్ , నలందా జూనియర్ డిగ్రీ కళాశాల లలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను జిల్లా క‌లెక్ట‌ర్‌ తనిఖీ చేశారు. అనంత‌రం పరీక్ష నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్బంగా అభ్యర్ధులు మొత్తం 6729 కి గాను 5469 మంది హాజరు, 1260 మంది గైరహాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *