Rajarshi Shah: పిల్ల‌లంద‌రికీ నులిపురుగుల నివార‌ణ మాత్ర‌లు వేయించాలి: క‌లెక్ట‌ర్ రాజర్షి షా

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
పిల్ల‌లంద‌రికీ నులిపురుగుల నివార‌ణ మాత్ర‌లు వేయించాలి: క‌లెక్ట‌ర్ రాజర్షి షా
* విద్యార్థులు పరిశుభ్రత పాటించాలి

19 సంవ‌త్స‌రాల లోపు పిల్లలంద‌రికీ పిల్ల‌లంద‌రికీ నులిపురుగుల నివార‌ణ మాత్ర‌లు వేయించాలని ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ రాజర్షి షా అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో ఏర్పాటు చేసిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమానికి జిల్లా పాలనాధికారి రాజర్షి షా పాల్గొని విద్యార్థినులకు మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటి నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు నులిపురుగుల నివారణ కోసం వేయడం జరుగుతుందని , తప్పనిసరిగా ఆహారం తీసుకున్న తర్వాత ఈ వయసు పిల్లలు మాత్రలను వేసుకోవాలని, మాత్రలు వేసుకున్న తర్వాతా చప్పరించి మింగాలని ఆన్నారు.అన్ని సబ్ సెంటర్ల లో, అన్ని అంగన్వాడి సెంటర్ల లో, స్కూలు , కళాశాలలో వేయడం జరుగుతుందని, 20వ తేదిన వేసుకోని వారు 27 తేదీ న ఖచ్చితంగా మాత్రలు వేసుకొనేల చూడాలని తెలిపారు. పాఠశాలలు, కాలేజీలలో పిల్లలకు సంబంధిత ఉపాధ్యాయని ,ఉపాధ్యాయులు మాత్రలు మింగించాలని తెలిపారు. విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని ఆన్నారు.జిల్లాలో 1 నుండి 19 సంవత్సరాల పిల్లలు 2,21,141 మంది ఉన్నారని వీరందరూ మాత్రలు వేసుకొనేల చూడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రాథోడ్ రవీందర్, డీఈఓ ప్రణీత, సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపల్, వైద్యాధికారులు, ఆశావర్కర్లు , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *