సిరాన్యూస్, ఆదిలాబాద్
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు: కలెక్టర్ రాజర్షి షా
బట్టి సావర్గాం, అగ్రజా టౌన్ షిప్ స్థలాలు పరిశీలన
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. బుదవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బట్టి సావర్గాం , అగ్రజా టౌన్ షిప్ లో మౌళిక వసతుల ఏర్పాట్లు , ప్రభుత్వ భూములను జిల్లా పాలనాధికారి రాజర్షి షా పరిశీలించారు.అగ్రజ టౌన్ షిప్ రాజీవ్ స్వగృహ నిర్మాణానికి అంతర్గత రోడ్లు, విద్యుత్, నీరు, బౌండరింగ్ వాల్, తదితర అభివృద్ది పనుల తీరును టీజీఐఐసీ నోడల్ ఏజెన్సీ డిప్యూటీ జోనల్ మేనేజర్ రాం దాస్ ను అడిగి తెలుసుకున్నారు. మౌళిక వసతుల ఏర్పాట్లను పరిశీలించి దిశా నిర్దేశం చేసి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో సింగిల్ గుంటభూమి కూడా ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి వాటి చుట్టూ ఫెన్సింగ్ , బోర్డులు ఏర్పాటు చేయాలని మునిసిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అన్యాక్రాంతం అయిన ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ భూములు పరిరక్షించాలని , అక్రమంగా నిర్మించిన లే అవుట్ లను గుర్తించి వాటి పై చర్యలు చేపట్టాలని ఆన్నారు. కలెక్టరు వెంట ఆర్‌డీఓ వినోద్ కుమార్, మునిసిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు, మునిసిపల్ అధికారులు,డీఈ లు,ఈఈ లు తదితరులు పాల్గొన్నారు.