సిరాన్యూస్, ఆదిలాబాద్
జడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం గురువారంతో గడువు ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి రాజర్షి షా జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ను మాజీ జడపీ చైర్మన్ జనార్దన్, అధికారులు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రత్నమాల, ఇతర జడ్పిటిసిలు పాల్గొన్నారు.