సిరాన్యూస్, కడెం
రుణమాఫీ చేయాలి : రైతు నేత రాజేంధర్ హపావత్
రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని రైతు నేత, సదర్ మాట్ కాలువ సాధన సమితి అధ్యక్షులు రాజేందర్ హపావత్ అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రైతు రుణమాఫీ చేసి రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. రైతుల పక్షాన రైతులకు రుణాలు మాఫీ అయ్యేంత వరకు పోరాడతామన్నారు.