సిరా న్యూస్, బోథ్
దేశభక్తిని పెంపొందించుకోవాలి
* పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండ రాజేంద్ర గౌడ్
* శిశు మందిర్‌లో షహీద్ దివస్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రము లో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ‘ షహిద్ దివస్ ‘ నిర్వహించారు. అనంతరం భగత్ సింగ్, రాజ్ గుర్, సుఖ్ దేవ్ అమరవీరులకు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండ రాజేంద్ర గౌడ్ మాట్లాడుతూ వీరు 23 ఏళ్ల వయస్సు లోనే బ్రిటిష్ వారి చేతిలో ఉరితీయబడ్డారని, దేశం కోసం వారి ప్రాణాలను తృణ ప్రాయంగా వదిలేశారని చెప్పారు. వారి త్యాగం, ధైర్యం నేటి యువత ఆదర్శంగా తీసుకొని , దేశభక్తి పెంపొందించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.