Raju: ఓబీసీల ఐక్యత కోసం పోరాడాలి : బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజు

సిరాన్యూస్‌,చిగురుమామిడి
ఓబీసీల ఐక్యత కోసం పోరాడాలి : బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజు

దేశ వ్యాప్తంగా వెనుకబడిన ఓబిసి కులాల హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజు అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓబీసీలకు రిజర్వేషన్ ఉండాల్సిందే అనే హైకోర్టు తీర్పును స్వాగతించారు.ఈ సందర్భంగా శ‌నివారం చిగురుమామిడి మండలంలోని సుందరగిరి ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కోర్టు తీర్పు ఓబీసీల విజయంగా భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కంది శంకర్,ఓబీసీ మొర్చ మండల అధ్యక్షుడు సతీష్,జిల్లా కార్యవర్గ సభ్యులు ముంజ చంద్రయ్య,బీజేపీ మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్,బీజేపీ నాయకులు జంగా శ్రీనివాస్ రెడ్డి,ఓబీసీ మండల కార్యదర్శి నడిగొట్టు కిరణ్,తూలైల వెంకన్న,కొయెడ శేఖర్, కట్ల సంపత్, కసావేని రమేష్, మెరుగు చంద్రయ్య ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *