Rajula satyam:బొడ్డోని కుంట పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి

సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
బొడ్డోని కుంట పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి
* కుంట‌ను ప‌రిశీలించిన‌ మున్సిపల్ చైర్మన్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గ‌ల‌ బోడ్డోని కుంట సమస్యను సోమ‌వారం మున్సిపల్ చైర్మన్ ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బోజ్జు పటేల్ కు దృష్టికి  తీసుకెళ్లారు.  స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. మంగ‌ళ‌వారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పలు డిపార్ట్మెంట్ల అధికారులను బొడ్డోని కుంట వద్దకు తీసుకువచ్చి సంబంధిత ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎమ్మార్వో తో కలిసి సమస్యలను వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మురికి కాలువ నీరు కుంటలోకి రావడంతో దుర్వాసన వస్తుందని చెప్పారు. పశువులు నీరు తాగలేకపోతున్నాయని, అలాగే కాలనీవాసులు అనారోగ్యానికి గురవుతున్నారని, దానిని దృష్టిలో ఉంచుకొని మురికి కాలువ నీరు కుంటలోకి రాకుండా చేయించాల‌ని సూచించారు. సుభాష్ నగర్ కాలనీలోని వాగు నుండి కుంటలోకి నీరు వచ్చేలా చేస్తామని, ఈ రెండు సమస్యలను పరిష్కరిస్తే కుంటకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్స్ నాయకులు కుర్మా శ్రీనివాస్ , జన్నారపు శంకర్ , నాయిని సంతోష్ , పరిమి సురేష్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , ఎమ్మార్వో శివరాజ్ , ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ ఈ నవీన్ , పలు డి పార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *