సిరాన్యూస్, నేరడిగొండ
రాజుల తండా సమస్యలు నిండా
* కనీస సౌకర్యాలకు నోచుకోని గ్రామం
* పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు… పట్టించుకోని అధికారులు
గ్రామంలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి అరకొరగా నిధులు విడుదల అవుతుండటం తో అభివృద్ధికి ఆటంకం కలిగి ఎక్కడి సమస్యలు అక్కడే రాజ్యమేలుతున్నాయి. పారిశుధ్య సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకొనేవారు లేరు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు.వాడల్లో నాళాలు, అంతర్గత రోడ్లు లేవు. పారిశుధ్యలోపం తలెత్తి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. పాఠశాలల్లో పెంటకుప్పలు ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలో బుద్ధికొండ గ్రామపంచాయతీలో గల రాజుల తండా సమస్యల విలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ గ్రామంలో మిషన్ భగీరథ నీరు వృధాగా పోతున్నా పట్టించుకునే వారే నాథుడే కరవయ్యారు. ఆ నీరు మురికి కాలువలో చేరి ఆ మురికి కాలువ రోడ్లపై ప్రవహిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్న పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామంలో ఉన్న పాఠశాల చుట్టూ పెంట కుప్పలు మారింది. దురువాసన వెదజల్లి గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.