సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను శనివారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖానాపూర్ భజరంగ్ దళ్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను ఖానాపూర్ పట్టణ వీధుల గుండా ర్యాలీ నిర్వహించామని అన్నారు . శ్రీ రామ్ నగర్ కాలనీలోని శ్రీ సీతారాముల ఆలయానికి హనుమాన్ భక్తులతో వెళ్లి పూజ కార్యక్రమం నిర్వహించామని అన్నారు . కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్స్ నాయకులు , పరిమి సురేష్ , భజరంగ్ దళ్ కార్యకర్తలు, పలు పార్టీల నాయకులు హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.