సిరాన్యూస్,ఖానాపూర్
తాగునీటి సమస్య ఇక ముందు ఉండదు : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
తాగునీటి సమస్య ఇక ముందు ఉండదని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం బర్కత్ పూర కాలనీ 6వ వార్డులో బోరు మోటార్ మరమ్మతులకు గురై తాగునీరు లేక కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈవిషయం స్థానిక కౌన్సిలర్ ఆఫ్రిన బేగం అమానుల్లా ఖాన్ ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కు తెలియజేశారు. వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్మన్ బోరు బావిలో నీటి మట్టంను పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటి కార్యాలయం నుండి నూతన బోరు మోటార్ ను ఏర్పాటు చేయించి తాగు నీటిని అందించారు. వార్డులలో ఎక్కడైనా సమస్యలు ఉంటే స్థానిక కౌన్సిలర్లకు లేదా మున్సిపాలిటీ కార్యాలయంలో తెలియజేయాలని అన్నారు.కార్యక్రమంలో నాయకులు కాలని వాసులు యూసుఫ్ ఖాన్ , షేక్ హైమద్ , ఎం,ఏ, జవిద్, వాహబ్, తురబ్, గమి, సోయాబ్,జియ ఖాదర్, మహమ్మద్ జియా, అజర్, మాజర్, జావిద్, మున్సిపాలిటీ వాటర్ సప్లై సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.