సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
సొంత ఖర్చులతో చేతి పంపుకు మరమ్మతులు చేయించిన మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో 11వ వార్డులో హ్యాండ్ పంపు చెడిపోయింది. ఈవిషయం 11వ వార్డు మహిళలు, కాలనీవాసులు మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మున్సిపల్ చైర్మన్ శుక్రవారం వెంటనే వాటర్ సప్లై సిబ్బందిని వెంట తీసుకువెళ్లి కొత్త మోటర్ సొంత డబ్బులతో వేయించారు. అందుకుగాను 11వ వార్డు నుంచి ఆడపడుచులందరూ మున్సిపల్ చైర్మన్ కి దీవెనలు ఇచ్చారు. కార్యక్రమంలో జహీద్ భాయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.