సిరా న్యూస్, ఖానాపూర్
కెనరా బ్యాంకును ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కెనరా బ్యాంక్ ను శనివారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , మండల అధ్యక్షులు దోనికెని దయానంద్ , కౌన్సిలర్ నాయకులు నాయిని సంతోష్ , పరిమి సురేష్ , షబ్బీర్ పాషా , తోట సత్యం , తదితరులు పాల్గొన్నారు.