Rajura Satyam: విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులు అందించాలి:  మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

సిరాన్యూస్‌, ఖానాపూర్
విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులు అందించాలి:  మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

స‌కాలంలో విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులు అందించాల‌ని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఉచితంగా అందిస్తున్నటువంటి స్కూల్ యూనిఫామ్ తయారీ కేంద్రాన్ని బుధ‌వారం ఆయ‌న పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖానాపూర్ పట్టణంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ సహకారాలతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత స్కూల్ యూనిఫాంల తయారీ కేంద్రం వద్దకు వెళ్లి యూనిఫాంలను పరిశీలించామని, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని అన‌నారు. ఎందరో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్ నాయకులు నాయిని సంతోష్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , మెప్మ పిడి సుభాష్ ,మెప్మా అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *