సిరా న్యూస్, ఖానాపూర్
చెక్ డ్యామ్ కాల్వలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని జెకె నగర్ కాలనీలోకి వర్షాకాలం అడవిలో నుంచి వస్తున్న వరద నీరు రాకుండా చేసేందుకు శనివారం అడవిలోకి వెళ్లి చెక్ డ్యామ్ కాల్వలను మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త అడవిలో ఉన్నటువంటి చెక్ డ్యాములు కాలువల ద్వారా జెకె నగర్ కాలనీకి వస్తున్న వరద నీరు రాకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అడవిలో నీరు కాలనీలోకి రాకుండా సంబంధిత అడవి అధికారులతో ఫోన్లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు యూసుఫ్ ఖాన్, చక్రం రాములు, వెంకటేష్, రాజు, మల్లేష్, సాగర్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.