సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
ప్రజలు ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 5వ వార్డు టవర్స్ కాలనీలో మంగళవారం వర్షాకాలంను దృష్టిలో ఉంచుకొని కాలనీలో నిల్వ ఉన్న నీటిలో మున్సిపల్ సిబ్బంది చేత ఆయిల్ బాల్స్ ను ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వంటి సీజనల్ వ్యాధులకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తగా నిల్వ ఉన్న నీటిపై దోమలు, అనేక రకమైన బ్యాక్టీరియాలు ఏర్పడకుండా ఆయిల్ బాల్స్ ను నిల్వ ఉన్న నీటిలో వేయించామని తెలిపారు. ప్రజలు ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని, ఇంటి చుట్టుపక్కల సామాగ్రిలో నిల్వ ఉన్నటువంటి నీటిని తొలగించాలని అన్నారు.కార్యక్రమంలో కౌన్సిలర్ నాయకులు పరిమి సురేష్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , మున్సిపాలిటీ మనల శంకర్ ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.