సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
* తాగునీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్మన్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పద్మావతి నగర్ కాలనీ 7వ వార్డులో బోరు మోటర్ పాడైపోయింది. తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని కౌన్సిలర్ కిషోర్ నాయక్ మంగళవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కు తెలియజేశారు. నూతన బోర్ మోటార్ ను వేయించి తాగునీటిని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలలో ఎటువంటి సమస్య ఉన్న కౌన్సిలర్లకు లేదా మున్సిపాలిటీ కార్యాలయంలో తెలియజేయాలన్నారు. సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కిషోర్ నాయక్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , ఎఈ తిరుపతి , పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, మున్సిపాలిటీ వాటర్ సప్లై సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.